మొబైల్స్ తయారీదారు వివో.. వై20ఐ, వై20 పేరిట రెండు నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను భారత్‌లో బుధవారం విడుదల చేసింది. వీటిల్లో 6.51 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దాని సహాయంతో ఫోన్‌ను కేవలం 0.22 సెకన్ల వ్యవధిలోనే అన్‌లాక్ చేయవచ్చు. వీటిలో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
వివో వై20, వై20ఐ స్పెసిఫికేషన్లు…
* 6.51 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* వై20ఐ – 3జీబీ ర్యామ్, వై20 – 4జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10
* 13, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు
* సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
వివో వై20ఐ ఫోన్ ధర రూ.11,490 ఉండగా దీన్ని సెప్టెంబర్ 3 నుంచి విక్రయిస్తారు. అలాగే వివో వై20 ఫోన్ ధర రూ.12,990గా ఉంది. దీన్ని ఆగస్టు 28 నుంచి విక్రయిస్తారు.