అంబటికి షాక్.. అక్రమ మైనింగ్ అంటూ సొంత పార్టీ కార్యకర్తలే పిటిషన్ !

-

సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ రాజుపాలెం వైకాపా కార్యకర్తల తరపున హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వారి తరపున హైకోర్టు న్యాయవాది రఘు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను వచ్చే నెలకి వాయిదా వేసింది కోర్టు. పిటిషన్ విచారణ అర్హత మీద కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నందుకే పిటిషన్ వేశానని పిటిషనర్ పేర్కొన్నారు.

ambati-rambabu

అయితే దీనిలో రాజకీయ దురుద్దేశం ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీంతో కేసును వచ్చే నెలకి వాయిదా వేసింది కోర్టు. రాజుపాలెం మండలం కోట నెమిలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని ఆ పిటిషన్ లో ఆరోపించారు. ఈ విషయమై కలెక్టర్ , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్ కు ఫిర్యాదులు పంపినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికే మైనింగ్ అధికారులు విచారణ జరిపారని పిటిషనర్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version