స‌మాజానికి మేలుచేసే ఆవిష్క‌ర‌ణ‌లు చేయాలి : ఫిన్‌టెక్‌లో సీఎం చంద్ర‌బాబు

-

సమాజ హితానికి, దేశ అభివృద్ధికి ఉపకరించే ఆవిష్కరణలు చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఫిన్‌టెక్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత బ్లాక్ చైన్ టెక్నాల‌జీని అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడే ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించామన్నారు.

నదీ జలాలు, భూగర్భ జలాలు, భూసారం, పర్యావరణం, విద్యుత్‌, రవాణా, నైపుణ్యం కలిగిన మానవ వనరులు మొదలైన అంశాలను ఈ-ప్రగతి ద్వారా అనుసంధానించి అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ లో సమయం, ఖచ్చితత్వాలను పాటించి మెరుగైన ఫలితాలను సాధిస్తామన్నారు. రాష్ట్ర జీడీపీ ప్రస్తుతం 10.3శాతం ఉందని.. దాన్ని 15శాతం సాధిస్తేనే తృప్తి ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిన గ్రామాల జాబితాల్లో ఆంధ్రప్రదేశ్ 55శాతం అవార్డులు గెలుచుకున్నట్లు హర్షధ్వానాల మధ్య చంద్ర‌బాబు తెలిపారు. సహజ వనరులు గుర్తించి, విజ్ఞానాన్ని వినియోగించి అభివృద్ధి సాధించడంలోనే నాయకత్వ పటిమ తెలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దానికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. వారికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం ఇస్తుందన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో వివిధ కంపెనీలు ,ఐటీ శాఖ మధ్య జరిగిన ఒప్పందాలు..

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ తో ఒప్పందం…ఫింటెక్ యాసిలిరేటర్ ఏర్పాటు ,ఫింటెక్ స్టార్ట్ అప్ కంపెనీలకు సహకారం అందించనున్న హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ డబ్ల్యూ హబ్ తో ఒప్పందం ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అప్ కంపెనీలు హాంకాంగ్ లో కార్యకలాపాలు విస్తరించేందుకు వేదిక ఏర్పాటు సోసా..తో ఒప్పందం ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అప్ కంపెనీలు ఇజ్రాయిల్ మరియు న్యూయార్క్ లో కార్యకలాపాలు విస్తరించేందుకు వేదిక ఏర్పాటు

సింగ్ ఎక్స్…ఇన్నోవేషన్ ఫెస్టివల్స్ నిర్వహణ లో భాగంగా అమరావతిలో కార్యాలయం ప్రారంభించనున్న
సింగ్ ఎక్స్ వాద్వాని ఫౌండేషన్,ఉదయం తో ఒప్పందం… కలిసి స్టార్ట్ అప్ కంపెనీల అభివృద్ధి కి సహకారం అందించనున్న వాద్వాని ఫౌండేషన్,ఉదయం ఫింటెక్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్ తో ఒప్పందం…హాంకాంగ్ తరహా ఫింటెక్ ఎకో సిస్టమ్ ఏర్పాటు…పరస్పర సహకారం బిజో ఫోర్స్ తో ఒప్పందం…

ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు

సిఐఎస్ఐ సర్టిఫికేషన్ తో ఒప్పందం…సర్టిఫికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పలు కంపెనీల కార్యకలాపాల ప్రారంభోత్సవాలు.. కార్డిలిటిక్స్ ఇండియా ఆపరేషన్స్ ప్రారంభం డిఎక్స్ సి గ్రామీణ యువత కి ఉపాది కల్పించనున్న డిఎక్స్ సి ఒన్ బ్రిడ్జ్ మరియు ఫేస్ బుక్  గ్రామాల్లో పారిశ్రామికవేత్తల ను ప్రోత్సహించే విధంగా కార్యక్రమం ఫెడరల్ బ్యాంక్ …టెక్నాలజీ కార్యకలాపాలు ప్రారంభంఫస్ట్ అమెరికన్ కార్పొరేషన్…
గ్రామీణ యువత కి ఉపాది కల్పించనున్న డిఎక్స్ సి

Read more RELATED
Recommended to you

Exit mobile version