దేశంలోని అతి పెద్ద టెలికాం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు షాక్‌నివ్వనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి పలు ప్లాన్ల చార్జిలను మార్చనున్నామని తెలిపింది. ఈ క్రమంలోనే మొబైల్ సర్వీస్ రేట్లను పెంచనున్నట్లు తెలిపింది.
దేశంలోని అతి పెద్ద టెలికాం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు షాక్‌నివ్వనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి పలు ప్లాన్ల చార్జిలను మార్చనున్నామని తెలిపింది. ఈ క్రమంలోనే మొబైల్ సర్వీస్ రేట్లను పెంచనున్నట్లు తెలిపింది. దీంతో కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ చార్జిలు కూడా పెరుగుతాయని తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ ఐడియా కంపెనీ నష్టాల నుంచి కొంత మేర గట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా నష్టాలు ఏకంగా రూ.50,921 కోట్లకు చేరుకున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే అటు సుప్రీం కోర్టు కూడా పెండింగ్‌లో ఉన్న బకాయిలను టెలికాం కంపెనీలు వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో వినియోగదారులపై భారం మోపక తప్పడం లేదని వొడాఫోన్ ఐడియా తెలిపింది. మరి ఈ విషయంపై కస్టమర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.