ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారాయి. గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పాం.కానీ, వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పని చేశారు.
వాలంటీర్లకు సంబంధించి ఏ పేపర్ వర్క్ ప్రభుత్వం దగ్గర లేదు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా దాఖలాలే లేవు.ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి వాలంటీర్లను మభ్యపెట్టారు’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను ప్రభుత్వానికి. ప్రజలకు మధ్య వారధిగా ఉపయోగించుకున్న విషయం తెలిసిందే.