కరోనా విలయతాండవం చేస్తున్న నేపద్యంలో తెలంగాణ సర్కార్ ఇప్పటికే టెన్త్ క్లాస్ విద్యార్థుల పరీక్షలు రద్దు చేసి అందరినీ ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో 5 లక్షల మండి విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. ఇక ఇదే నేపద్యంలో నేడు వారికి గ్రేడ్లు కేటాయించడం ప్రారంభమయ్యింది. విద్యార్థుల ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ప్రతిపాదికన వారికి గ్రేడ్లు కేటాయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడి ప్రకటించారు. గ్రేడ్ వివరాలు గ్రీడ్ పాయింట్ ల నియామకం అయ్యే తీరు గురించి తెలుసుకోవాలంటే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుండి www.bse.telangana.gov.in వెబ్ సైట్ లోకి ప్రవేశించి తెలుసుకోవచ్చు. ఇక మెమోలు స్కూల్ యాజమాన్యం నుండి తీసుకోవాల్సిందిగా మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది.
సాధారణంగా ప్రతి ఏడాది విలేకరుల సమావేశంలో మీడియాకు రిజల్ట్స్ ఉండే సీడీలను అందజేసి తరువాత పాస్‌వర్డ్ చెప్పేవారు. దీంతో ఎక్కువ సైట్లలో పరీక్షల ఫలితాలు అందుబాటులో ఉండేవి. కానీ ఈ సారి కేవలం ఒక్క వెబ్‌సైట్ (https://www.bse.telangana.gov.in/) లోనే 10వ తరగతి ఫలితాలను అందుబాటులో ఉంచడంతో.. ప్రస్తుతం సర్వర్ మొరాయిస్తోంది. అనేక మందికి వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు.