ఇస్రో తయారు చేసిన అద్భుతమైన రోబో, అంతరిక్షంలోకి వెళ్తుంది…!

-

2022లో రోదసీ లోకి మనుషుల్ని పంపేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. గగనయాన్ ప్రాజెక్టు ద్వారా రోదసీలోకి మనుషులను పంపిస్తుంది ఇస్రో. వారితో పాటుగా మరొకరిని కూడా పంపిస్తుంది మన అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఆ మరొకరు వ్యోమ మిత్ర. వ్యోమ మిత్ర అంటే ఏంటీ అనుకుంటున్నారా…? ఎం లేదండి ఇస్రో తయారు చేసిన రోబో పేరు.

రోబో ఒకటి తయారు చేసి దానికి ఆ పేరు పెట్టారు. మనుషుల్లా మాట్లాడటమే కాదు, ఆలోచించే, పనిచేసే రోబో. ఇది మన వ్యోమగాములతోనే ఉంటూ, వాళ్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. ఎవరికైనా ఆరోగ్యం తేడా వస్తే వెంటనే ఇస్రోకి రిపోర్ట్ పంపిస్తుంది. అదే విధంగా ఇది చక్కగా మాట్లాడుతుంది. ఇస్రో ఏదైనా ప్రశ్నలు అడగగానే వెంటనే సమాధానం ఇస్తుంది. దీనితో ఇస్రో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది.

ఇది ప్రయోగాత్మక పద్ధతిలో పంపించబోతున్న రోబో కాబట్టి ఇది పనిచేసినా, చేయకపోయినా శాస్త్రవేత్తలకు వచ్చిన నష్టమేమీ లేదు అంటున్నారు. భవిష్యత్తులో రోబో వాడకం అనేది కీలకమయ్యే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ఇస్రో దీనికి శ్రీకార౦ చుట్టింది. చక్కగా అమ్మాయి మాదిరిగా ఉన్న ఈ రోబో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news