కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

-

సాధారణంగా కోపం కంట్రోల్ చేసుకోవడం కష్టం. చాలా మంది ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువ కోపానికి గురి అయిపోతూ ఉంటారు. అయితే కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి…? ఎలాంటి మార్గాలని పాటించడం వల్ల కోపాన్ని అదుపు చేసుకోగలం…? ఇలా అనేక విషయాలు మీ కోసం…

మాట్లాడే ముందు ఆలోచించండి:

కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నో మాటలు అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి కోపం లో ఉన్నప్పుడు మాట్లాడకండి. కాసేపు ఆలోచించి అప్పుడు మీరు మాట్లాడడం వల్ల మీరు సందర్భాన్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతారు.

శాంతంగా ఉండండి:

బాగా విపరీతంగా కోపం వచ్చినప్పుడు కాసేపు శాంతంగా ఉండండి. శాంతంగా ఉండకపోతే మీరు అనే మాటలు ఇతరులను గాయ పరుస్తాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండి అప్పుడు మీ కోపాన్ని మీరు చూపించండి. దీనితో మీరు ఎదుటి వాళ్లు బాధపడే మాటలని అనలేరు.

వ్యాయామం చేయండి:

వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కాసేపు వాకింగ్ లేదా రన్నింగ్ చేయండి. దీని వల్ల సులువుగా మీరు మీ కోపాన్ని అదుపు చేసుకోగలరు.

బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి :

మెడిటేషన్ లాంటివి చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు కోపాన్ని అదుపు చేసుకోగలరు. లేదంటే మీరు మంచి మ్యూజిక్ వినడం, కొన్ని యోగ భంగిమలు వేయడం వల్ల కూడా మీరు కోపాన్ని తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version