మీ భయాలను దూరం చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ పద్ధతులు మీకోసం..!

-

చాలా మందికి భయం ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి బయటపడడం కూడా ఎంతో కష్టం. నిజంగా భయం నుంచి దూరంగా ఉండాలి అంటే ఈ విధంగా అనుసరించడం ముఖ్యం. ఈ పద్ధతులని కనుక మీరు పాటించారంటే ఎంత భయం నుండి అయినా కూడా మీరు బయట పడవచ్చు.

 

సమయం తీసుకోండి:

భయపడుతూ పేరు వేగంగా పనులు పూర్తి చేయొద్దు. కాసేపు మీరు రిలాక్స్ గా ఉండండి ముందు ఫిజికల్ గా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి డిస్ట్రక్షన్ లేకుండా మీరు దూరంగా వచ్చేయండి. 15 నిమిషాల పాటు వాకింగ్ చేయడం. ఒక కప్పు టీ తాగడం లేదా స్నానం చేయడం ఇలాంటి పనులు చేయండి.

నెమ్మదిగా శ్వాస తీసుకోండి:

మీరు ఒక దగ్గర కూర్చుని మీ చేతులని మెడిటేషన్ పొజిషన్ లో పెట్టి నెమ్మదిగా శ్వాస తీసుకోండి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ భయాన్ని వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా మీరు భయాన్ని పక్కన పెట్టి నెమ్మదిగా , నిశబ్దంగా కాసేపు కూర్చోండి.

మీ భయాలని ఎదుర్కోండి:

మీరు మీ భయాన్ని పక్కన పెడితే కానీ అవి మీ నుండి దూరం అవ్వవు. మీకు వచ్చే భయాన్ని మీరు ఎదుర్కొంటే కానీ అది పోదు కాబట్టి మీరు భయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

చెడుగా మీరు ఇమాజిన్ చేసుకోండి:

మీరు ఎంత భయంకరంగా ఆలోచించగలిగితే అంత భయంకరంగా ఆలోచించండి. దీనితో మీకు ఏమైనా భయము కలిగిన అది మీకు పెద్దగా భయం అనిపించదు. కాబట్టి చాలా చెడ్డ వాటిని మీరు ఇమాజిన్ చేసుకోండి.

దాని కోసం మాట్లాడండి:

మీరు భయాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల కూడా భయం దూరం అవుతుంది. మీరు ఒకవేళ దీని కోసం ఎవరితోనైనా మాట్లాడాలని మీకు లేకపోతే థెరపిస్ట్ ని కన్సల్ట్ చేయొచ్చు.

మీరు మీ పనుల్లోకి వెళ్లిపోండి:

మీరు రోజు ఏ పనులు చేస్తారో ఆ పనులు చేస్తూ ఉండండి. నిద్రపోవడం, తినడం, నడవడం ఇలా అంతేకానీ మీరు భయపడుతున్నారు కదా అని వాటిని వదిలేసి కేవలం దానికోసమే ఆలోచించొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news