20 ఏళ్ళుగా పరారిలో ఉన్న క్రిమినల్… కూతురు ఇచ్చిన సమాచారంతో…!

-

మహారాష్ట్ర ముంబై పోలీసుల దోపిడీ నిరోధక విభాగ౦ పాట్నాలో పరారిలో ఉన్న గ్యాంగ్ స్టర్ ఎజాజ్ లక్దవాలాను గురువారం అరెస్ట్ చేసింది. గ్యాంగ్ స్టర్ ఎజాజ్ లక్డావాలా గత 20 సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడు. అతనిపై 27 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. ఎజాజ్ లక్దవాలాను జనవరి 21 వరకు పోలీసు కస్టడీకి తరలించారు. పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ అనేక దోపిడీ, హత్యాయత్నం మరియు అల్లర్లకు సంబంధించి వెతుకుతున్నారు.

పాట్నాలో బుధవారం రాత్రి 10:30 గంటలకు ఎజాజ్ లక్దవాలాను అరెస్టు చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ ఎక్స్‌ట్రాక్షన్ సెల్, ఎజాజ్ కుమార్తె సోనియా లక్దవాలాను బుధవారం దోపిడీకి పాల్పడిన రెండవ కేసులో అరెస్టు చేసింది. తన తండ్రి ఎజాజ్ లక్దవాలా ఆదేశాల మేరకు బాంద్రా కు చెందిన రియల్టర్ బెదిరించి దోపిడీకి పాల్పడిన కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గ్యాంగ్ స్టర్ ఎజాజ్ లకాద్వాలా అరెస్టుపై క్రైమ్ జాయింట్ కమిషనర్ సంతోష్ రాస్తోగి మాట్లాడుతూ, “అతని కుమార్తె మా అదుపులో ఉంది. ఆమె మాకు చాలా సమాచారం ఇచ్చింది. పాట్నాలో ఆయన రాక గురించి మా వర్గాలు కూడా మాకు చెప్పాయి, అతన్ని జట్టన్‌పూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు” అని చెప్పారు. ప్రస్తుతం వీరు ఇద్దరినీ కోర్ట్ ఆదేశాల మేరకు పోలీసులు కస్టడీకి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version