ఎం జరుగుతుంది…? ఎస్సై హత్యతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అలజడి…!

-

తమిళనాడు, కేరళ రాష్ట్ర సరిహద్దుల్లో అలజడి రేగింది. ఒక ఎస్సైని దుండగులు కాల్చి చంపడం ఇప్పుడు కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే తమిళనాడుకు చెందిన స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ విల్సన్‌ కలియిక్కవిలాయ్ జిల్లా స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. పదంతలుమూడు అనే ప్రాంతంలో చెక్ పోస్ట్ దగ్గర వెహికిల్స్‌ని చెక్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆ ప్రాంతంలోకి దుండగులు ఓ SUV కారులో వచ్చారు.

ఎస్సై దగ్గరకు వచ్చిన వాళ్లు, సడెన్‌గా కారు దిగి, దిగడం దిగడమే, నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఎస్సై తల, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. చెక్ పోస్ట్ దగ్గరున్న మిగతా పోలీసులు ప్రతిఘటించే లోపే, దుండగులు కారులో పారిపోయారు. ఎస్సైని దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించారు. ఈ ప్రాంతం సరిగా కేరళ సరిహద్దుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సెర్చ్ టీమ్ ఏర్పాటైంది. మూడు బృందాలుగా విడిపోయిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. అసలు వాళ్ళు ఆయన్ను ఎందుకు కాల్చి చంపారు అనేది తెలియకపోయినా వాళ్ళు స్మగ్లర్లు అని పోలీసులు అనుమానిస్తున్నారు. అటు కేరళ పోలీసులు కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన గతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో పని చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version