కేంద్రంపై వార్.. సింగ‌రేణిలో స‌మ్మె సైర‌న్

-

కేంద్ర ప్ర‌భుత్వంపై సింగ‌రేణి కార్మికులు, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. ప్రాంతీయ లేబ‌ర్ క‌మిషన‌ర్ తో ఈ రోజు సింగ‌రేణి కార్మిక సంఘాలు జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. దీంతో దీంతో సింగరేణి కార్మిక సంఘాలు టీబీజీకేఎస్, ఐఎన్ టీయూసీ, బీఎంఎస్ సంఘాల ప్ర‌తినిధులు లేబ‌ర్ క‌మిషన‌ర్ కు స‌మ్మె నోటీసుల‌ను అంద‌జేశారు. దీంతో సింగ‌రేణి కార్మికులు స‌మ్మెకు దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

కాగ సింగరేణిలో ఉన్న 4 బోగ్గు బ్లాకుల‌ను వేలం వేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవల నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తో పాటు సింగ‌రేణి కార్మిక సంఘాలు కూడా తీవ్రంగా వ్య‌తిరేఖిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేంద్ర నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతూ విమ‌ర్శ‌లు చేశారు. కార్మిక సంఘాల నేత‌లు కూడా సింగరేణి బోగ్గు బ్లాకుల‌ను వేలం వేస్తే.. స‌మ్మె త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. అలాగే నేడు బోగ్గు బ్లాకుల వేలం గురించి ప్రాంతీయ లేబ‌ర్ క‌మిషన‌ర్ తో చ‌ర్చ‌లు జ‌రిపారు. కాగ ఈ చర్చ‌లు విఫ‌లం కావ‌డంతో స‌మ్మె నోటీసు అంద‌జేశారు.

Read more RELATED
Recommended to you

Latest news