పోలీసుల ముందే ప్రేమ జంటపై దాడి

-

పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ జంటపై దాడి జరిగింది. వరంగల్ – నల్లబెల్లిలో ప్రేమజంటపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. వారం క్రితం ప్రేమ పెళ్లి చేసుకొని శనిగరానికి చెందిన బాలరాజు అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకుంది ఈ ప్రేమ జంట. అయితే బాలరాజు ఇంట్లో లేని సమయంలో బంధువులు వచ్చి గొడవ చేయడంతో అడ్డుకున్నారు స్థానికులు.

Warangal - Couple attacked by girl's relatives in Nallabelli
Warangal – Couple attacked by girl’s relatives in Nallabelli

దీంతో పోలీసులను ఆశ్రయించింది ప్రేమ జంట. ఈ విషయం తెలుసుకున్న స్టేషన్‌కు వచ్చి పోలీసుల ముందే జంటపై దాడి చేశారు అమ్మాయి బంధువులు. ఇక నల్లబెల్లిలో ప్రేమజంటపై అమ్మాయి బంధువులు దాడి చేసిన సంఘటన పై కేసు బుక్ చేసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news