ఆ హోటల్ లో తిన్నా, తినకున్నా రూ.50 కట్టాల్సిందే..ఎందుకంటే?

-

మనం ఎక్కడికైనా హోటల్ కు వెళితే ముందుగా మనల్ని ఏం కావాలి అని అడుగుతారు.మనం ఆర్డర్ చేసింది తిన్నా, తినకున్న కూడా బిల్లు లో మార్పులు ఉండవు.. కానీ ఇప్పుడు చెప్పబోయే హోటల్ లో మాత్రం తినకున్న బిల్లు వేస్తారట.. అంతేకాదు మనం ఏదైనా తినొచ్చు ఎంతైనా తినొచ్చు కానీ ఏది వదిలిపెట్టకుండా తినాలి. లేకుంటే యాభై రూపాయల ఫైన్ వేస్తారు.

అదేంటి తినడానికి డబ్బులు కడతాం తినక పోయినా డబ్బులు కట్టాలా ఇదేంటి తేడాగా ఉంది అని అనుకుంటున్నారా అవును ఇది కొంచెం డిఫరెంట్ ఈ హోటల్ రూటే సపరేటు.. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు .అన్నం విలువ తెలియని ఎంతో మంది ఆహారాన్ని వృధా చేస్తూ ఉంటారు. నిత్యం మనం ఆహారం కోసం అలమటించేవాళ్లను, దేహీ అని అడిగే వాళ్లను చూస్తూ ఉంటాం.. అలాంటి వారికి మనం సహాయం చేస్తాం లేదా వారికి కొంచెం ఆహారం పెట్టిస్తాం..కానీ ఈ హోటల్ దంపతులు మాత్రం గత ముప్పై ఏళ్ళుగా నిరుపేదలకు అన్నం పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉచిత భోజనం పెట్టారు.

ఇప్పటికీ హోటల్ ముందుకు వచ్చి ఆకలి అంటే చాలు కడుపు నిండా అన్నం పెడతారు..లింగాల కేదారి ఫుడ్ కోర్ట్.. వరంగల్‌లో ఈ పేరు తెలియని వారు లేరు. ఈ హోటల్‌లో ఫుడ్‌ రుచి చూడని వారు లేరు.మనం ఏదైనా తినొచ్చు కేవలం 50 రూపాయలు మాత్రమే. తినక పోతే మరో యాభై అదనంగా చెల్లించాలి. మనం ఈ హోటల్‌లోకి ఎంటర్ కాగానే మన దగ్గర నుండి వంద రూపాయలు తీసుకుంటారు. భోజనం అయిపోయాక మనం తిన్న ప్లేట్ వారికి చూపిస్తే తిరిగి మనకు 50 రూపాయలు ఇస్తారు. మనం తిన్న ప్లేట్లు ఏమైనా మిగిలితే ఆ 50 రూపాయలు తీసుకుంటారు..ఈ మధ్య ధరలు పెరగడం తో ప్లేట్ 100 రూపాయలు చేశారు.ఒకవేళ మీరు కూడా లింగాల కేదారి ఫుడ్ కోర్ట్ కి వెళ్లి తినాలి అనుకుంటే హనుమకొండ డిస్ట్రిక్ట్ కోర్ట్ పక్కనే ఈ హోటల్ ఉంటుంది లేదా హనుమకొండ సర్కిల్ అంటే ఎవరైనా చెప్తారు.అక్కడకు వెళితే ఒకసారి ఆ ఫుడ్ ను రుచి చూడండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version