ఎస్. పీ. శైలజ ఎంతమందికి వాయిస్ యాక్టర్ గా పని చేసారో తెలుసా..?

-

ప్రముఖ భారతీయ గాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్.పి.శైలజ అలియాస్ శ్రీపతి పండితారాధ్యుల శైలజ. కొన్ని చిత్రాలలో నటిగా కూడా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది . ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం చిత్రాలలో కూడా తనదైన శైలిలో పాటలు పాడి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె 1962 అక్టోబర్ 9వ తేదీన నెల్లూరులో జన్మించింది. ఇక ఈమె అన్నయ్య ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అని అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం , హిందీ , కన్నడ, మళయాళం చిత్రాలలో నేపథ్యగాయకుడిగా పనిచేశారు. సాంబమూర్తి , శకుంతలమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో ఆమె చివరిది.

ఇక ఎస్ పి శైలజ ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ మేనకోడలు. ఇక కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగరసంగమం అనే తెలుగు చిత్రంలో మొదటిసారి శైలజ నటించింది. ఇందులో శాస్త్రీయ నృత్య కళాకారిణి పాత్ర పోషించి మంచి పేరు సంపాదించుకుంది. కేవలం వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తన కెరీర్ ని మొదలు పెట్టింది .ఈటీవీ లో ప్రసారమయ్యే సరిగమప షో ని ప్రారంభించి గాయకుడు మనో తో కలిసి ఆమె హోస్ట్గా చేశారు. ఇక అంతే కాదు ఎన్నో పాటల షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మంచి మనసున్న గాయకురాలిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం నటి , గాయకురాలు మాత్రమే కాదు వాయిస్ యాక్టర్ కూడా. తన అద్భుతమైన గాత్రాన్ని కేవలం పాటలు పాడడానికి మాత్రమే వినియోగించకుండా ఎంతో మంది స్టార్ హీరోయిన్లకు వాయిస్ డబ్బింగ్ కూడా చెప్పింది. ఇక ఆమె ప్రముఖ అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి తో పాటు సోనాలి బింద్రే, టబు వంటి స్టార్ హీరోయిన్లకు కూడా డబ్బింగ్ చెప్పింది. ఇక సీతామాలక్ష్మి సినిమాలో హీరోయిన్ రామేశ్వరి కి డబ్బింగ్ చెప్పడం మొదట ప్రారంభించింది. తర్వాత తెలుగు నుండి తమిళ్ కి.. తమిళ్ నుండి తెలుగులోకి అనువదించబడిన చిత్రాలలో హీరోయిన్లకు వాయిస్ డబ్బింగ్ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఎస్.పి.శైలజ.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version