ఏపీ విద్యుత్ వినియోగదారులకు మనలోకం వార్నింగ్…?

-

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 500 యూనిట్స్ పైన వాడిన వారికి ఇక నుంచి విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. 500 యూనిట్స్ పైన వాడిన వారికి యూనిట్ కి 0.90 పైసలు వడ్డన పడనుంది. 500 యూనిట్స్ వడిన టారిఫ్ ఇక నుండి రూ 9.05 పైసలు నుండి రూ 9.95 పైసలు గా టారిఫ్ గా పెరగనుంది. ఈ నెల నుంచి ఇది వర్తించనుంది.

ఈ నిర్ణయం భారం ప్రభుత్వ, కార్పోరేట్ సంస్థల పై పడనుంది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల వినియగడారుల్లో 1.30 లక్షల వినియోగ దారుల పై పెంపు భారం పడుతుంది. 501 యూనిట్లు వచ్చినా సరే 500 ఎక్కువ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీటర్ రీడింగ్ తీసే సమయం ఒక రోజు ఆలస్యం అయితే ఆ భారం బారీగా పడే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు ఈ నెల 460 యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత నెల 2 న రీడింగ్ తీసారు. ఈ నెల 4 న రీడింగ్ తీస్తే రెండు రోజుల్లో 40 యూనిట్ల విద్యుత్ వాడకం జరిగితే అప్పుడు భారీగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి విద్యుత్ వాడకం విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్న తేడా వచ్చినా సరే భారీగా కట్టుకోవాల్సి ఉంటుందీ అంటూ పలువురు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news