స్టీల్ ప్లాంట్ కి 11 వేల కోట్లు కోటాయించిన మోడీ ఇప్పటివరకు 11 రూపాయలు కూడా ఇవ్వలేదు అని K.A.పాల్ అన్నారు. అదానీకి మోడీ తొత్తు కాబట్టే స్టీల్ ప్లాంట్ నీ అమ్మేస్తున్నాడు. స్టీల్ ప్లాంట్ నీ అమ్మేయటానికి ప్లానింగ్ జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ నాయకులందరూ కూడా అమ్ముడి పోయారు. పవన్ కళ్యాణ్ మాట మోడీ వింటున్నాడు కదా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ చెప్పమనండి.
మరో సంవత్సరంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తారు. చంద్రబాబు తన కొడుకుని సీఎం చెయ్యటానికి ఆలోచిస్తూ వుంటే, పవన్ కళ్యాణ్ తప్పులన్నింటిని చంద్రబాబు మీద తోసేసి 2029 లో సీఎం కావటానికి ఆలోచనలు తప్ప రాష్ట్రం బాగు కోసం ఆలోచనలు చెయ్యటం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎందుకు అడగటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్యాకేజీ స్టార్స్, వీళ్ళిద్దరూ ప్యాకేజీ కి అమ్ముడుకుపోయారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యాడంటే చంద్రబాబు బిక్షే కదా, లేదంటే పవన్ కళ్యాణ్ జీవితంలో ఎమ్మెల్యే అవ్వగలడా. చిరంజీవి ఒకప్పుడు కాంగ్రెస్ కి అమ్ముడుకుపోయి, ఇప్పుడేమో బీజేపీ కి అమ్ముడిపోవటానికి సిద్ధం అవుతున్నాడు అని K.A.పాల్ పేర్కొన్నారు.