సుశాంత్ చ‌నిపోయే ముందు రియా అక్క‌డే వుందా?

-

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి వెనుక పెద్ద కుట్రే దాగి వుందా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు అందుకు అద్దంప‌డుతున్నాయి. సుశాంత్ అనుమానాస్ప‌ద మృతి త‌రువాత రియా డ్ర‌గ్స్ బాగోతం బ‌య‌టికి రావ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నార్కోటిక్స్ డ్ర‌గ్ కంట్రోల్ బ్యూరో ఈ కోణంలో విచార‌ణ చేప‌ట్టింది. సుశాంత్ మ‌ర‌ణానికి ముందు అత‌ని ఇంట్లో పార్టీ జ‌రిగిన‌ట్టు ఓ జాతీయ మీడియా సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టింది.

లాక్‌డౌన్ స‌మ‌యంలో సుశాంత్‌తో క‌లిసి రియా వుంద‌న్న విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డిస్తూ వ‌స్తోంది. జూన్ 8న తాను సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయాన‌ని తెలిపింది కానీ ప్ర‌త్య‌క్ష సాక్షుల ప్ర‌కారం రియా జూన్ 13న‌ అంటే సుశాంత్ మృతి చెందిన రోజు వ‌ర‌కు అక్క‌డే వుంద‌ని, సుశాంత్ స్వ‌యంగా రాత్రి 2 నుంచి 3 గంట‌ల ప్రాంతంలో అర్ధ్ర రాత్రి ఆమెని డ్రాప్ చేశాడ‌ని ఓ ప్ర‌త్య‌క్ష సాక్షి చెప్ప‌డంతో రియా కావాల‌నే అబ‌ద్ధం చేబుతోంద‌ని తేలిపోయింది. దీంతో సీబీఐ 302 సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా సుశంత్ మృతి కేసులో సిద్ధార్ధ్ పితానీని కూడా సీబీఐ మ‌రోసారి విచార‌ణ‌కు పిల‌వ‌బోతోంద‌ట‌. సుశాంత్ మృతి చెందిన రోజు సిద్ధార్ధ్ పితాని ఇంట్లోనే వున్నార‌ట‌. ఆ కార‌ణంగా అత‌న్ని ప్ర‌త్య‌క్ష సాక్షిగా ప‌రిగ‌ణించి మ‌రో సారి అత‌న్ని విచారించ‌బోతున్న‌ట్టు తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version