బంజారాహిల్స్ లో పెను ప్రమాదం సంభవించింది. ఓ వాటర్ ట్యాంకర్ ఏకంగా నాలా లోకి దూసుకు వెళ్ళింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1 లో నాలా ఛాంబర్ పైకి వాటర్ ట్యాంకర్ దూసుకు వెళ్ళింది. భారీ వర్షం పడ్డ నేపథ్యంలో… రోడ్లన్నీ చిత్తడి చిత్తడిగా తయారయ్యాయి. కొన్ని రోడ్లు అయితే కుంగిపోయాయి.

ఇందులో భాగంగానే బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 1 కూడా వాటర్ ట్యాంకర్ బరువుకు కుంగిపోయింది. ఈ నేపథ్యంలోనే వాటర్ ట్యాంకర్ పూర్తిగా నాలాలోకి దూసుకు వెళ్ళింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-1లో నాలా ఛాంబర్ పైకి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్ pic.twitter.com/nigHHfG19O
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2025