మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగం ఏదైనా ఉందంటే అది నిద్ర అని చెప్పొచ్చు. శరీరానికి కావలసినంత విశ్రాంతి అవసరం, మనం రోజువారి పనులు ముగించుకొని మన శరీరంతో పాటు మనసుకి విశ్రాంతినిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. ఇది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు శరీర పెరుగుదలకు మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా పిల్లలు, యువకులు వారి శరీర పెరుగుదలకు నిద్రపోవడం ఎంతో ముఖ్యమైన ప్రక్రియ. మరి నిద్ర శరీర పెరుగుదలను ఎలా ప్రభావితం చేస్తుందో దాని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం ఏంటన్నది మనము తెలుసుకుందాం..
మనం నిద్రపోయేటప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుందని అందరికీ తెలిసిందే, అలాగే అనేక జీవక్రియలు చురుగ్గ పనిచేస్తాయి అని కొందరికే తెలుసు. పిల్లలు ముఖ్యంగా యువకులు ఎత్తు పెరగడానికి వారి కండరాలు బలంగా మారడానికి నిద్ర ఎంతో కీలకమైనది. నిద్రపోయే టైంలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఈ హార్మోన్ ఎముకలు కండరాలు, ఫాస్ట్ గా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. ఇక గాఢ నిద్రలోకి వెళ్లే దశలో ఈ చర్య ఇంకొంత ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది శరీర ఎదుగుదలకు కూడా ఎంతో సహాయపడుతుంది.
నిద్రలో శరీరం మెలతో అనే హార్మోను ఉత్పత్తి చేస్తుంది. ఇది మనం నిద్రపోయే టైం నియంత్రిస్తుంది. రోజు ఒక టైం కి మనం నిద్రపోవడం అలవాటు చేసుకుంటే శరీరం ఆటోమేటిక్ ఆ టైంకి నిద్ర వచ్చేలా చేస్తుంది. ఇలా ప్రేరేపించడానికి ముఖ్యమైన కారణం మెలటోనిన్ అనే హార్మోన్. నిద్ర పోయేటైం లో ఒత్తిడి తగ్గి, స్ట్రెస్ హార్మోన్ తగ్గి హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్ విడుదల ఎక్కువవుతుంది. దీని ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇది మనం ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
శరీరానికి కావాల్సినంత నిద్ర ఎంతో ముఖ్యం తగినంత నిద్ర లేకపోవడం వల్ల హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది ఇది శరీర పెరుగుదలకు ఆటంక పరుస్తుంది. అంతేకాక ఒత్తిడి ఆందోళన రోగనిరోవ శక్తి తగ్గడం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. పిల్లల్లో నిద్రలోపం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. అందుకే రోజు ఒక టైం ప్రకారం పడుకోవడం లేవడం అలవాటు చేసుకోవాలి. నిద్రపోయేముందు ఫోన్,టీవీలు వంటి ఎలక్ట్రానిక్ స్క్రీన్ లకు దూరంగా ఉండాలి. చీకటి నిశ్శబ్ద వాతావరణం లో నిద్రపోవడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా హాయిగా నిద్ర పట్టాలంటే ముందు మనం మితంగా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.