అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ఇవాళ వాడీ వేడి చర్చ జరిగింది. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణ సాధించుకున్నారని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో ఎన్నో అంశాలు పెట్టారని.. కేంద్రంలోని బీజేపీ మన హక్కులను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించింది.నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసింది. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపనుందని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం అని తెలిపారు. ఈ లోపు కేంద్రం సవరించిన బడ్జెట్లో తెలంగాణకు న్యాయం చేస్తామని తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇస్తామని , తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని, గిరిజన యూనివర్సిటీ పూర్తిస్థాయిలో ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.