వాలంటీర్ల‌కు శుభ‌వార్త‌.. వారిని కొన‌సాగిస్తున్న‌ట్లేనా

-

వాలంటీర్ల‌కు మ‌రొసారి శుభ‌వార్త‌ను చెప్పింది ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారికిస్తున్న రూ.5వేల వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని ఎన్నిక‌ల ప్ర‌చారంలో హామీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో వారికిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఆలస్యమవుతుండటంతో వాలంటీర్లంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వారికి శుభవార్త వినిపించడమే కాకుండా కీలక ప్రకటన కూడా చేసింది. వాలంటీర్ల వేత‌నాన్ని 5 వేల నుంచి 10 వేల‌కు పెంచుతూ ప్ర‌క‌ట‌న చేశారు మంత్రి బాల‌వీరాంజ‌నేయ‌స్వామి.

Ap volunteer

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రశ్నోత్తరాల వేళ వాలంటీర్లకు సంబంధించిన ప్రశ్నను పంపించారు. దీనిపై సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వాలంటీర్ల వేతనాన్ని పెంచబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే వారికి సంబంధించి మంచి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలిపారు. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌రు ర‌ద్దు చేయ‌కుండా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దీంతో వాలంటీర్లు హ‌ర్షం వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. నిన్న‌టివ‌ర‌కు త‌మ ఉద్యోగాలు ఉంటాయా లేదా అని ఆందోళ‌న చెందుతున్న వాలంటీర్ల‌కు వేత‌నం పెంపు వార్త నిజంగా ఆనందం క‌లిగించేదే.

నిధుల కొరత వెంటాడుతున్న తరుణంలో వాలంటీర్ల వేత‌నం .10వేలకు పెంపు అనేది ప్రభుత్వానికి భారంగా మారుతుందా? అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లకు రూ.10వేల వేతనం పెంచి, వారి విద్యార్హతలను పరిశీలించి, వీరికి మూడు సంవత్సరాల కాలపరిమితితో మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు చెబుతున్నారు. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే మ‌రో శుభ‌వార్త వింటార‌ని ప‌లువురు ఎమ్మెల్యే ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చారు. జ‌రుగుతున్న ప‌నరిణామాల‌ను బ‌ట్టి చూస్తే త్వ‌ర‌లోనే వాలంటీర్ల సేవ‌ల‌ను వాడుకునేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news