ఆర్థిక ఇబ్బందులున్నా బాధితులకు సాయం చేస్తున్నాం : చంద్రబాబు ట్వీట్

-

ఏపీకి ఆర్థిక ఇబ్బందులున్నా కష్టాల్లో ఉన్న ప్రజలకు బెస్ట్ ప్యాకేజీ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ వరదల సమయంలో 10 రోజులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌నే సచివాలయంగా మార్చుకుని పనిచేశామని, నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ ఇవ్వని స్థాయిలో సాయం చేస్తున్నామని చంద్రబాబు బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. బాధితులకు అందించే పరిహారానికి సంబంధించిన వివరాలను ఆయన షేర్ చేశారు.

ఇదిలాఉండగా, ఏపీ ప్రభుత్వం ఖజానా ప్రస్తుతం ఖాళీగా ఉందని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు గుర్తుచేశారు. రాష్ట్రం విడపోయినప్పటి నుంచి లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీ.. గత ప్రభుత్వం ముందు చూపు లేని తనంలో మరింత అప్పుల్లో కూరుకుపోయిందని సీఎం ఆరోపించారు. ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే ఖజానా ఖాళీ అయ్యిందని, అభివృద్ధి పనులపై ఎలా ముందుకు పోవాలో అర్థం కావడం లేదని ఇదివరకే సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news