మనమింతే.. మనం అస్సలు మారం.. మారే ప్రసక్తే లేదంతే.. ఎన్ని కరోనాలు వచ్చినా.. ఎంత మంది దాని వల్ల చనిపోయినా.. ప్రపంచం అసలు ఏమైనా సరే.. మనకు సంబంధం ఏమీ లేదు. అనవసరంగా బయటకు రాకండి.. అంటే వినం.. మాస్కులను ధరించండి.. అంటే పట్టించుకోం. భౌతిక దూరం పాటించండి.. అంటే రాసుకు పూసుకు తిరుగుతాం. ఆ మాటకొస్తే.. ఒకరిమీద ఒకరం ఎక్కి తిరుగుతాం.. అంతే.. మనం ఎందుకు మారాలి ? మారాల్సిన అవసరం ఏముంది ?
రోడ్లపై అడ్డ దిడ్డంగా వెళ్తాం.. ట్రాఫిక్ నిబంధనలను అస్సలు పట్టించుకోం.. సిగ్నల్ మారడానికి టైమున్నా సరే.. బండిని ముందుకు దూకిస్తాం.. రైళ్లు, బస్సులే కాదు, విమానాల్లోనే ఎక్కేముందు, దిగేముందు ఎందుకు క్యూ పాటించాలి.. అబ్బే.. సమస్యే లేదు. హడావిడిగా వెళ్లాల్సిందే. ఒక్క నిమిషం కాదు కదా.. ఒక్క సెకను కూడా ఆగే ప్రసక్తే లేదు. ఎవరి కోసం ఆగాలి ? ఎందుకు ఆగాలి ? మాకు ఆగేంత సమయం లేదు. ఒకరిమీద ఒకరం పడి అయినా వెళ్తాం కానీ.. భౌతిక దూరం నిబంధనను పాటించే ప్రసక్తే లేదు.
See the situation of Kolkata's bus on 8th June 2020 for yourself.
Video by a friend. 2/2#COVIDー19 #COVID19India #Covid_19 pic.twitter.com/kdsTgfY4Oa
— anv# (@nv3sh) June 8, 2020
పోస్టులో పైన ఇచ్చిన ఫొటో, వీడియోలను చూస్తే.. ఎవరికైనా సరే.. పైన చెప్పిన లాగే అనిపిస్తుంది. అయితే నిజానికసలు మన దేశ పౌరులకు క్రమశిక్షణ అనేది నిజంగా ఏ కోశానా లేదు. ఇంతటి అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్లే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించినా, ఎత్తేసినా.. ఇంతటి బాధ్యతారాహిత్యం ఉంటే.. కరోనా కేసులు ఏమాత్రం తగ్గవు.. పరిస్థితి అస్సలు అదుపులోకి రాదు.. అలాంటప్పుడు ప్రభుత్వాలను నిందించి కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. మన దేశం ఇలా ఉండడానికి నిజానికి సగం మనమే కారణం. న్యూజిలాండ్ వంటి దేశాలు కరోనా నుంచి బయట పడ్డాయంటే.. అక్కడి ప్రజలు పాటించిన క్రమశిక్షణే అందుకు కారణం. అది లేనినాడు.. ఎన్ని లాక్‌డౌన్‌లు విధించినా, ఎంతటి కఠిన నియమాలను అమలు చేసినా.. వృథా ప్రయాసే అవుతుంది. మన దేశ పౌరులు క్రమశిక్షణ పాటిస్తారని అనుకోడం నిజంగా అడియాశే అవుతుంది..!