దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు వలస కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకుని వలస కార్మికులను చాలా వరకు జాగ్రతగా తరలిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే వలస కార్మికుల తరలింపు విషయంలో ఇంకా జాప్యం జరుగుతుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. కేసుల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.
అందుకే కేంద్రం ఇప్పుడు వలస కార్మికుల కోసం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి ప్రత్యేక విమానాలను నడపాలి అని భావిస్తుంది. ఈ మేరకు భారీ విమానాలను నడిపే ఇండిగో సంస్థతో కేంద్రం ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. వలస కార్మికుల విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే మరణాలు ఆకలి తో పెరిగే అవకాశం ఉంది అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అందుకే ఇప్పుడు వలస కార్మికులను తరలించడానికి గానూ విమానాలు బెటర్ అనే వ్యాఖ్యలు కేంద్ర పెద్దల నుంచి వినపడుతున్నాయి. రోజు రోజుకి తీవ్రత పెరుగుతుంది కాబట్టి మహారాష్ట్ర తెలంగాణా తమిళనాడు ఢిల్లీ నుంచి వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించడానికి గానూ విమానాలను వినియోగించాలి అని కేంద్రం భావిస్తుంది. చూడాలి మరి ఎంత మందిని తరలిస్తారు అనేది…