భక్త రామదాసు జయంతి ఉత్సవాలను ఖమ్మం జిల్లా నేలకొండపల్లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ ఉత్సవాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. భక్త రామదాసు మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం అని పేర్కొన్నారు.నేలకొండపల్లిలో రామదాసు మందిరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలోనూ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్త రామదాసు ధ్యాన మందిరంలో ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. 3వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా 3 రోజులపాటు పలు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి హాజరవుతున్నారు.