రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు గరం అవుతున్నాయి.దీంతో సీఎం చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా స్పందించారు. మంగళవారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు.
తాము అధికారంలోకి రాక ముందు రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు ఉందని అనుకున్నామని.. తీరా చూస్తే రూ.8 లక్షల కోట్లు ఉందన్నారు. అంత అప్పు ఉన్నా 15 నెలల పాలనలో సంక్షేమ పథకాలను ఏనాడూ ఆపలేదన్నారు.ప్రతి నెలా అప్పులకే దాదాపు రూ.6,500 కోట్లు మేర చెల్లిస్తున్నామని.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. నిరుపేదలకు ఇళ్లు,ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, షో పాలిటిక్స్ చేయడం ఇందిరమ్మ ప్రభుత్వానికి తెలియదన్నారు. అప్పుల విషయంలో నిజాలను ప్రజలకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలని వెల్లడించారు.