రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశమై మాట్లాడారు. అంతకుముందు ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం సరిగా నడపలేకపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘం నేతలతో అన్నట్లు సమాచారం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అందరూ బాగున్నారని, తెలంగాణ వచ్చాకే ఎక్కువ నష్టపోయామంటూ కామెంట్స్ చేశారు. వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని, అవసరానికి కావాల్సిన ఆదాయంలో ప్రతినెలా రూ. 4వేల కోట్లు తక్కువ పడుతుందని వివరించారు.
ఆర్థిక ఇబ్బందుల వల్లే కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వారిని రెగ్యులరైజ్ చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రెగ్యులరైజ్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.