మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఖమ్మం పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ఉంది… మీటింగ్ అనంతరం మా ప్రభుత్వం ద్వారా రైతన్నలకు తీపి కబురు చెబుతానని వెల్లడించారు. రైతన్నలకు ఇచ్చిన హామీ కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన భరోసా కానీ యువతకిచ్చిన ధైర్యాన్ని కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చెత్త శుద్ధితో పని చేస్తామని ప్రకటించారు.
నియోజకవర్గానికి 3500 తగ్గకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాననని వెల్లడించారు .అంతకు ముందు స్లాబ్ లెవెల్ కిటికీ లెవెల్ ఉన్న వాటిని పూర్తి చేయటం జరిగింది ఈ డబల్ బెడ్ రూమ్ ఇళ్లని సంక్రాంతి లోపే ఇవ్వటం జరుగుతుందన్నారు. అవే కాకుండా అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను కూడా బెన్న్ ఫ్రెషర్స్ కి ఇవ్వాల్సిన పైకం ఇచ్చి మిగతావి లబ్ధిదారులకి ఇస్తూ దాన్ని కూడా కట్టుకోవడానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు.