తాము కేవలం 1.8% ఓట్ల తేడాతోనే ఓడిపోయామని బీఆర్ఎస్ చీఫ్ ,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘మాకు 38%, మీకు 39.8% ఓట్లు పోలయ్యాయి. మేం ఔట్ కాలేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం అని అన్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి అని ,ప్రతి పంటకు రూ.500 బోనస్ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే మిమ్మల్ని గద్దలెక్క వెంటాడుతా.వదిలిపెట్టను అని హెచ్చరించారు. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు’ అని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
తనను బద్నాం చేయాలనే కుట్రతో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేసీఆర్ ఫైరయ్యారు. ‘కాళేశ్వరం గురించి ఈ కాంగ్రెస్ నాయకులకు వెంట్రుక కూడా తెల్వదు అని ఎద్దేవ చేశారు. మేడిగడ్డ వద్ద 300 పిల్లర్లతో బ్యారేజీ నిర్మించాం.ఇక ఆ 300 పిల్లర్లలో 3 కుంగిపోతే మొత్తం మునిగిపోయినట్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. చిన్నచిన్న పొరపాట్లు సహజం. మేడిగడ్డ కింద ఇసుక కదిలిపోయింది అంతే. దానికి ఏదో ప్రళయం వచ్చినట్లు హంగామా చేస్తున్నారు’ అని కేసిఆర్ విమర్శించారు.