తులం బంగారం ఇవ్వని రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టండి : కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మీ పథకం ఏర్పాటు చేశాం. కళ్యాణ లక్ష్మీ పథకం కింద తొలుత రూ.50వేలు, ఆ తరువాత రూ.1,01,116 అందించామని గుర్తు చేశారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రూ.1,01,116 తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. తులం బంగారం ఇవ్వని రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టండి అని కేసీఆర్ పేర్కొన్నారు.

తాము కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయామన్నారు కేసీఆర్. మాకు 38 శాతం మీకు 39.8 శాతం ఓట్లు పోలయ్యాయి. మేము ఔట్ కాలేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25వేలు పరిహారం ఇవ్వాలి. ప్రతీ పంటకు రూ.500 బోనస్ ప్రకటించాలి. ఇవ్వకపోతే మిమ్మల్ని గద్దలెక్క వెంటాడుతా.. వదిలిపెట్టను. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news