దీపాలు వెలిగిద్దాం.. సమైక్యతను చాటుదాం..

-

ప్రపంచానికి ఒక సమస్య వచ్చింది.. అది దేశానికి పట్టింది.. ఇలాంటి ఆపత్కర సమయంలో మన వంతుగా చేయాల్సిందల్లా ప్రభుత్వాలు చెప్పినట్టు వినడమే… ఇంట్లో నుండి బయటికి రావద్దు మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించుకోండంటూ దేశ ప్రధాని చేతులు జోడించి వేడుకున్నారు. మనం ఏం చేస్తున్నాం.. ఆచరిస్తున్నామా.. అవును ఆచరిస్తున్నాం.. ౯౯ శాతం ప్రజలు ప్రధాని మాటకు కట్టుబడి ఉన్నారు.కేవలం ఒక్క శాతం మాత్రమే పాటించడం లేదు.. ఈ ఒక్కశాతం చాలు మిగిలిన ౯౯ శాతాన్ని పాడు చేయటానికి.. ఒక్క విషపు చుక్క బిందెడు పాలను పాడు చేసినట్టుగా ఈ ఒక్క శాతం మంది కరోనాను వ్యాప్తి చేస్తున్నారు.

చప్పట్లు కొట్టండి అన్న ప్రధాని మాటలను వెక్కిరిస్తున్నారు.. దీపాలు పెట్టండంటే ఎగతాళి చేస్తున్నారు.. అయ్యా బాబులు చప్పట్లు కొట్టి మన కోసం పని చేస్తున్నవారికి అభినందనలు చెప్పటం.. గల్లీల్లో తిరిగే మనకే వంద రకాల ఉపాయాలు వస్తుంటే దేశాన్ని పాలించే వారికి తెలియదా ఏం చెయ్యాలో ఎందుకు చెయ్యాలో.. తెలియదా..???

ఇది పక్కన పెట్టండి.. ఇక్కడ చెప్పింది ఒకవ్యక్తి మాత్రమే కాదు.. మనందరికి మార్గ నిర్ధేశ్యం చేసే ప్రధాని.. దేశ బాగు కోరే ఒక మార్గదర్శి.. సో.. దీపం వెలిగిస్తే బీజేపీకి ఓటు వేసినట్టు కాదు.. రాజకీయాలు మానుకోండి.. ఆ రాజకీయాలు చేసేటప్పుడు చేత కాలేదు కానీ.. ఆపత్కర పరిస్థితుల్లో అవసరంలేదు..

మనలోకం పాఠకులకు విజ్ఞప్తి.. మన నాయకుడు చెప్పినట్టుగా చేద్దాం… దీపాలు వెలిగిద్దాం.. మన ఐక్యమత్యాన్ని చాటుదాం.. కరోనాపై పోరాడదాం..

– RK

Read more RELATED
Recommended to you

Exit mobile version