కేంద్ర బడ్జెట్ లో తమిళనాడు ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.తమిళనాడు చారిత్రక విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ నిధులు కేటాయించలేదని ,తమిళనాడుకు ఎలాంటి పథకాలు ప్రకటించలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు.
ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై ధ్వజమెత్తారు. ఈ కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని విమర్శించారు. విభజన హామీల్లో ఏపీకి నిధులు కేటాయించిన వారికి.. తెలంగాణ గుర్తు కు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అనేకసార్లు తెలంగాణ పరిస్థితిపై వివరించిన నిధులు కేటాయించలేదని మండిపడ్డారు.