తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (ఏప్రిల్-14) అంబేడ్కర్ జయంతి సందర్బంగా పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలు రేపు బంద్ కానున్నాయి. అయితే, ఇటీవల అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ తరుణంలోనే తెలుగు రాష్ట్రాలు రేపు పబ్లిక్ హాలీడేను డిక్లేర్ చేశాయి. ఇప్పటికే విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. శనివారం (హనుమాన్ జయంతి), నేడు (ఆదివారం) రేపు కూడా సెలవు రావడంతో అటు విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. అటు బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు సైతం సెలవును పాటించనున్నాయి.