అధికారంలోకి రాగానే ఆదివాసి డిక్లరేషన్ అమలు చేస్తాం: వైయస్ షర్మిల

-

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ ముద్దుబిడ్డలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే ఆదివాసీ డిక్లరేషన్ ను పూర్తిస్థాయిలో అమలు చేస్తామంటూ ట్వీట్ చేశారు షర్మిల. ” ఆదివాసి ముద్దుబిడ్డలకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు. ఆదివాసీల అభివృద్ధికి వైయస్సార్ తెలంగాణ పార్టీ కట్టుబడి ఉంది.

అధికారంలోకి వచ్చిన వెంటనే.. మా పార్టీ రూపొందించిన ఆదివాసి డిక్లరేషన్ను పూర్తిస్థాయిలో అమలుచేసిి.. వారి సంక్షేమానికి కృషి చేస్తాం”. అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే..సోమవారం గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు వైయస్ షర్మిల. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..

కాలేశ్వరం అవినీతిపై కాంగ్రెస్, బిజెపి ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. మెగా కృష్ణారెడ్డికిి అమ్ముడు పోయారా? అంటూ మండిపడ్డారు. కాలేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందని చెప్తున్న బిజెపి అధికారంలో ఉండి కూడా ఎందుకు విచారణ జరిపించడం లేదని అన్నారు. మీకు రాజకీయాలు కావాలి కానీ ప్రజా ప్రయోజనం అక్కర్లేదా? అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version