మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిని తరిమికొడతాం – మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇటీవల మాజీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నరా భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టిడిపి నేతలు విరుచుకుపడుతున్నారు. కొడాలి నాని పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. తాజాగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పందిస్తూ.. రాష్ట్రానికి పట్టిన శనిని తరిమికొట్టేందుకు ప్రతీ కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని అన్నారు.

వైసీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను, ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. వైసిపి నేతలు యదేచ్ఛగా ఇసుక, మద్యం దోచుకుంటున్నారని వండిపడ్డారు. టిడిపిని ఎదుర్కోలేక జగన్ కొడాలి నానితో చంద్రబాబు కుటుంబ సభ్యులను దూషించి రాక్షస ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిని తరిమికొడతాం అంటూ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version