ఏపీ రాజకీయాల్లో వైసీపీ సోషల్ మీడియా అంత స్ట్రాంగ్‌గా మరొక పార్టీ సోషల్ మీడియా విభాగం లేదని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి గల ప్రధాన కారణాల్లో వైసీపీ సోషల్ మీడియా విభాగం ఒకటి. సోషల్ మీడియా పని ఒకటే…ప్రత్యర్ధులని ఆరోపణలని తిప్పికొట్టడం…అలాగే ప్రత్యర్ధులని ఇరుకున పెట్టేలా ఆరోపణలని ప్రచారం చేయడం.
అయితే అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ సోషల్ మీడియా ఎక్కడా తగ్గడం లేదు..తీవ్ర స్థాయిలోనే టీడీపీకి, జనసేనకు కౌంటర్లు ఇస్తుంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఏ స్థాయిలో ప్రత్యర్ధులని తిడతారో చెప్పాల్సిన పని లేదు. ఇలా స్ట్రాంగ్ గా ఉండే వైసీపీ సోషల్ మీడియాకు టీడీపీ సోషల్ మీడియా గట్టి పోటీ ఇస్తుంది. అదే సమయంలో జనసేన సోషల్ మీడియా సైతం వైసీపీనే టార్గెట్ చేస్తుంది. అలాగే బీజేపీ కూడా అదే పనిలో ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా విభాగాలు జగన్‌ని గట్టిగా టార్గెట్ చేస్తున్నాయి. అదే సమయంలో న్యూట్రల్ విభాగాల నుంచి కూడా జగన్‌పై విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా జగన్ సూపర్ స్ట్రాటజీతో ముందుకొచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వైసీపీ సోషల్ మీడియా విభాగాలు అన్నీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో నడిచేవి.
సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాల దాడి, ఆరోపణలు పెరుగుతుండడంతో కౌంటర్ స్ట్రాటజీ టీమ్ అవసరమని భావించి తాజాగా సోషల్ మీడియా వింగ్ కార్యకర్తలతో భేటీ అయిన జగన్….సోషల్ మీడియా విభాగం బాధ్యతలని సజ్జల తనయుడుకు అప్పగించాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. ఇక ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా పనిచేయనుంది.