వచ్చే నెల 4 తర్వాత యూపీని ‘మాఫియా రహిత ‘ రాష్ట్రంగా ప్రకటిస్తామని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.ఆదివారం ప్రకటనలో ఆయన, క్రిమినల్ సిండికేట్‌లపై తమ ప్రభుత్వం కఠిన వైఖరిని అనుసరిస్తుంది అని తెలిపారు. మాఫియాకు చెందిన ఆస్తులను జప్తు చేయడమే కాకుండా, ఆయా ఆస్తులను సమాజంలోని నిరుపేద, అనాథ, మహిళా ఆశ్రమాలు, వికలాంగుల అవసరాలను తీర్చేందుకు, వెనుకబడిన వర్గాలకు పునఃపంపిణీ చేసేందుకు వినియోగిస్తామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
మాఫియాకు చెందిన అక్రమ భూముల్లో ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మిస్తాం అన్నారు. మొదటి దశలో మాఫియాపై ఉక్కుపాదం మోపి, రెండో దశలో వారి ఆస్తులను జప్తు చేస్తాం అని స్పష్టం చేశారు. దీనికి అవసరమైన ప్రణాళిక కూడా సిద్ధం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో అశాంతిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారిపై 7 తరాల పాటు ప్రభావం ఉండేలా శిక్షలు ఉంటాయని యోగి ఆదితనాథ్ వార్నింగ్ ఇచ్చారు.