రైతులు పండించే పంటలకు కనీస మద్ధత్తు ధర కల్పించేందుకు అధ్యయానం చేయడానికి ఒక కమిటీ ని ఏర్పాటు చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు.అలాగే ఏడాది కాలం గా ఆందోళన చేస్తున్న రైతులు ఇక తమ ఇళ్లకు వెళ్లాలని కేంద్ర మంత్రి విజ్ఞాప్తి చేశారు. అయితే ఇప్పటికే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
అలాగే ఎంఎస్‌పీ గురించి అధ్యయనం చేయడానికి కమిటీ ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన విషయాన్నీ కూడా గుర్తు చేశారు. అలాగే రైతులు చేస్తున్న డిమాండ్ల ను పరిష్కరించ డానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. దానికి తాను హామీ ఇస్తున్నాని ప్రకటించారు. పంటల వైవిధ్యం, జోరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్ధత్తు ధర తో పాటు యంత్రాంగాన్ని పటిష్టం చేయడం వంటి అంశాల పై అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఒక కమిటీ ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కమిటీ తో రైతుల డిమాండ్ ఎంఎస్ పీ కూడా నెరవేరుతుందని అన్నారు.