న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ అశ్విన్ సహనం కోల్పోయారు. తన బౌలింగ్ శైలిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అంపైర్ నితిన్ మీనన్‌తో వాగ్యుద్ధానికి దిగాడు. అశ్విన్ అంపైర్ చుట్టూ తిరుగుతూ కొత్త లైనప్ తీసుకున్న తర్వాత వాదన మొదలైంది. తాను సరిగానే రన్ అప్ చేశానని అంపైర్ నితిన్ మీనన్‌కు పదే పదే సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ దృష్టికి తీసుకెళ్లారు.
మ్యాచ్ మధ్యలో మరోసారి కూడా సహనం కోల్పోయి కోపంతో నేలను తన్నాడు. టామ్ లాథమ్ 66 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా అశ్విన్‌కు వికెట్లు ముందు దొరికిపోయాడు. ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ, టీమిండియా డీఆర్‌ఎస్ తీసుకోలేదు. రీప్లేలో బాల్ వికెట్లు గరాటు వేసినట్లు స్పష్టంగా కనిపించింది. దీనిని బిగ్ స్క్రీన్‌లో చూసిన అశ్విన్ సహనం కోల్పోయి కాలును నేలకేసి తన్నాడు.