హెల్మెట్ వాడకపోయినా ఫర్వాలేదు.. తప్పనిసరి కాదు..

-

దేశవ్యాప్తంగా గత కొద్ది రోజుల కిందట అమలులోకి వచ్చిన నూతన మోటారు వాహన చట్టం ప్రకారం హెల్మెట్ ధరించకపోతే భారీ ఎత్తున జరిమానా కట్టాల్సి ఉంటుందన్న విషయం విదితమే. అయితే దేశంలోని కేవలం కొన్ని రాష్ర్టాల్లో మాత్రమే ఈ భారీ ఫైన్లను వసూలు చేస్తున్నారు. కానీ ఎక్కడైనా సరే.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాల్సిందే. లేదంటే ఎంతో కొంత మొత్తాన్ని ఫైన్ రూపంలో చెల్లించాలి. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం హెల్మెట్ వాడకంపై ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే…

గుజరాత్‌లో ఇకపై చిన్న చిన్న గల్లీలు, మున్సిపల్ పరిధిలో హెల్మెట్లు పెట్టుకోకపోయినా ఫర్వాలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గల్లీల్లో హెల్మెట్లను పెట్టుకోవడంపై ఆ ప్రభుత్వానికి చాలా ఫిర్యాదులు వస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు. అయితే గ్రామీణ రోడ్లు, జాతీయ, రాష్ట్ర రహదారులు, సిటీలు, పట్టణాల్లో మాత్రం తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని అన్నారు.

కాగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న నూతన మోటారు వాహన చట్టం ప్రకారం హెల్మెట్ ధరించకపోతే కొన్ని చోట్ల రూ.1వేయి వరకు ఫైన్ విధిస్తున్నారు. దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్సును కూడా కొన్ని చోట్ల రద్దు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version