తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

-

తెలంగాణా రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న దక్షిణ ఒరిస్సా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఒరిస్సా తీరము & పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది.

నిన్నటి ఉపరితల ఆవర్తనం మరియు ఈస్ట్‌వెస్ట్ షీర్ జోన్ ఈ రోజు 20°N వెంబడి సగటు సముద్రం మట్టంకి 3.1 కి.మీ నుండి 7.6 కిమీ ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉంది. ఈ రోజు రుతుపవన ద్రోణి జైసాల్మర్, కోట, మాండ్ల , రాయిపూర్, ఝార్సిగూడ,తీవ్ర అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version