రెండు తెలుగు రాష్ట్రాల కు మరోసారి వాతావరణం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 9వ తేదీన అంటే ఎల్లుండి లో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 11 మరియు 12 వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక ఇవాళ రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.
అటు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలో.. అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక భారీ వర్షాల కారణంగా వరి మరియు పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పూర్తిగా చేను పైనే ఉండటంతో… నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.