పెళ్లి వేడుకలో కాజల్ తీన్మార్ స్టెప్పులు.. వీడియో వైరల్..!

-

దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాణిగా కొనసాగి ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కాజల్ అగర్వాల్ ఇటీవలే ప్రేక్షకులందరికీ షాకింగ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తన ప్రియుడితో పెళ్లికి సిద్ధమయ్యాను అంటూ చెప్పడంతో అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. కాగా నేడు కాజల్ పెళ్లి సాయంత్రం జరగబోతున్న విషయం తెలిసిందే. దాదాపు గత నాలుగు రోజుల నుంచి కాజల్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.

మెహందీ హల్దీ సంగీత్ వేడుకలలో కాజల్ మెరిసి పోయింది అనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా కాజల్ కి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇక ఇటీవలే ఈ వేడుకకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియోలో కాజల్ తీన్మార్ బ్యాండ్ పై స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది ఇది చూసిన అభిమానులు అందరూ మురిసిపోయారు.https://www.instagram.com/p/CG770CMB1_F/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news