సెలవు వచ్చిందంటే చాలు అది చేయాలి ఇది చేయాలి అని అనుకుంటాం. కానీ అనుకున్నవి చెయ్యరు. పైగా రోజంతా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండి పోతారు.. అయితే వృధా చేయకుండా ఈ వీకెండ్ ని ఈ సలహాలతో గడిపేయండి. దీనితో మీరు రోజంతా ఆనందంగా ఉండొచ్చు.
కొత్త సినిమాలు:
మీకు నచ్చిన సినిమాలు లేదా కొత్త సినిమాలని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోండి. పక్కనే మీకు నచ్చిన స్నాక్స్ పెట్టుకొని ఇంట్లోనే ఆనందంగా గడిపేయడం. దీనితో ఫుల్ గా ఎంజాయ్ చెయ్యచ్చు.
పాటల్ని వింటూ పనులు చేయడం:
సెలవు రోజు వచ్చిందంటే చాలు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. బట్టలు వాష్ చేయడం వగైరా పనులు అన్నిటిని కూడా చక్కగా మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ చేసుకోండి. ఇలా చేస్తే మీరు మీ పనులు ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు.
మీ పెట్స్ తో గడపండి:
ఇంట్లో ఉండే పెట్స్ ని నిజంగా మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి సరదాగా వాటితో కాసేపు కాలక్షేపం చేయండి. దీంతో మీకు మంచి ఆనందం కలుగుతుంది.
మీ ప్యాషన్ తో మీరు గడపండి:
మీకు ఏ ప్యాషన్ ఉంటే దానితో కాసేపు గడపడం వల్ల మీకు చాలా ఆనందం కలుగుతుంది కవితలు, కథలు రాయడం లేదా గిటార్ ప్లే చేయడం మొదలైన వాటితో మీరు కాసేపు వెచ్చించండి.
అనుకున్న పుస్తకాన్ని చదవడం:
పుస్తకం చదవాలి అని కొనుక్కుని ఉంటారు. కానీ చదవడం కుదరకపోతే… వీకెండ్ రోజున ఆ పుస్తకాన్ని పూర్తి చేసుకోండి. మీకు చాలా ఆనందం కలుగుతుంది.
స్నేహితులతో డిన్నర్ చేయడం:
మీరు మీ ఇంట్లోనే స్నేహితులతో కలిపి డిన్నర్ ప్లాన్ చేసుకోవచ్చు. దీంతో చక్కగా స్నేహితులందరూ కలిసి కాసేపు కబుర్లతో కాలక్షేపం చేయవచ్చు. దీంతో మీ వీకెండ్ మరింత బాగుంటుంది.