BREAKING: “నీతి ఆయోగ్” ను బహిష్కరించారు మరో సీఎం. కొనసాగుతున్న “నీతి ఆయోగ్” 9 వ పాలక మండలి సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వచ్చారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అనంతరం కేంద్రం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పశ్చిమ బెంగాల్ సిఎమ్ మమతా బెనర్జీ…. సమావేశాన్ని బహిష్కరించినట్లు ప్రకటన చేశారు.
పశ్చిమ బెంగాల్ ను అవమానించారమని నిప్పులు చెరిగారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 5 నిముషాలే మాట్లాడించారని.. పశ్చిమ బెంగాల్ కు నిధులు అడగ్గానే నన్ను మాట్లాడకుండా మైక్ ఆపేశారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాల పట్ల పూర్తి వివక్షత ఉందని… రాజకీయమయంగా కేంద్ర బడ్జెట్ మారిందని ఆగ్రహించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్ర బడ్జెట్ సమాఖ్య స్పూర్తిని ప్రతిబింబిస్తోందని ప్రభుత్వం చెప్పుకుందని.. కానీ, మీకిష్టమైన రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ లు ఇచ్చుకోవచ్చు అని తెలిపారు…కానీ రాష్ట్రాలను విస్మరించలేరని ఫైర్ అయ్యారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..