కరోనా వైరస్ నేపథ్యంల ప్రస్తుతం అందరూ మాస్కులను ధరిస్తున్నారు. మాస్కులను ధరించడం వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందువల్లే ప్రస్తుతం వీటి వినియోగం కూడా ఎక్కువైంది. అయితే మార్కెట్‌లో మనకు పలు రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో రకాలు ఏమిటో, అవి ఎందుకు పనికి వస్తాయో, ఎవరెవరు ఏ తరహా మాస్కులను ధరించాలో, వాటి వాడకంపై అనేక మందికి ఎదురయ్యే సందేహాలు, వాటికి సమాధానాలను.. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. మాస్కుల్లో రకాలేమిటి ?
క్లాత్ మాస్క్, సర్జికల్ మాస్క్
2. రెస్పిరేటర్స్ అంటే ఏమిటి ?
ఎన్ 95, ఎన్99, ఎన్ 100 లను రెస్పిరేటర్లు అంటారు.
3. మాస్క్‌కు, రెస్పిరేటర్‌కు మధ్య ఉన్న తేడా ఏమిటి ?
మాస్కులు వదులుగా ఉంటాయి. ముక్కు, నోటిని అవి గట్టిగా మూయలేవు. మాస్కుల చివరి భాగాల్లో గాలి సులభంగా ప్రసారమవుతుంది. రెస్పిరేటర్ ముక్కు, నోటిని గట్టిగా పట్టి ఉంచుతుంది. అవి టైట్‌గా ఉంటాయి. దీంతో గాలి రెస్పిరేటర్ మాస్కుల్లో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా లోపలికి ప్రసారమవుతుంది.
4. అన్ని రెస్పిరేటర్ మాస్కులు ఒక్కటేనా ?
కాదు, వాటిల్లో గ్రేడ్‌లు ఉంటాయి. ఎయిర్ ఫిల్టరేషన్‌ను బట్టి ఆ గ్రేడ్‌లు మారుతాయి. వాటిలో రక రకాల ఎయిర్ ఫిల్టర్లు ఉంటాయి. భిన్నమైన మెటీరియల్‌తో వాటిని తయారు చేస్తారు. అవి భిన్న రకాలుగా ఉంటాయి.
5. గ్రేడింగ్ సామర్థ్యం అంటే ?
ఎన్ 95, ఎన్ 99, ఎన్ 100 అని భిన్న రకాల సామర్థ్యాలను రెస్పిరేటర్ మాస్కులు కలిగి ఉంటాయి. 95 శాతం, 99 శాతం, 99.99 శాతం వరకు గాలిలో ఉండే పదార్థాలను ఇవి అడ్డుకుంటాయి. అలాగే పీ1 (ఎఫ్ఎఫ్‌పీ1) 80 శాతం, పీ2 (ఎఫ్ఎఫ్‌పీ2) 95 శాతం, పీ3 (ఎఫ్ఎఫ్‌పీ3) 99.95 శాతం అని గ్రేడ్‌లు కూడా ఉంటాయి. ఇవి ఆ శాతాలకు అనుగుణంగా గాలిని ఫిల్టర్ చేస్తాయి.
6. మాస్కుపై ఉండే NR లేదా P కి అర్థమేమిటి ?
N అంటే నాట్ ఆయిల్ ప్రూఫ్, R అంటే ఆయిల్ రెసిస్టెంట్, P అంటే ఆయిల్ ప్రూఫ్ అని అర్థాలు వస్తాయి. ఎన్95 అంటే ఆయిల్ ప్రూఫ్ కాదని తెలుసుకోవాలి.
శ్వాసక్రియ మరింత సులభంగా జరిగేందుకు కొన్ని రకాల మాస్కులకు వాల్వులను అందిస్తారు. దీంతో లోపల పేరుకుపోయే కార్బన్ డయాక్సైడ్ మరింత సులభంగా బయటకు వెళ్తుంది. బయటి నుంచి ఆక్సిజన్ లోపలికి చాలా సులభంగా ప్రసారమవుతుంది. అలాగే లోపలి వైపు ఉష్ణం, తేమ ఏర్పడకుండా ఉంటాయి.
8. సర్జికల్ మాస్కులను ఎప్పుడు వాడాలి ?
కేవలం వైద్య సిబ్బంది మాత్రమే సర్జికల్ మాస్కులను వాడుతారు. బాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ అందించేందుకు వీటిని డిజైన్ చేయలేదు. కేవలం పెద్ద సైజులో ఉండే తుంపరలు, స్ప్రే వంటివి, ఇతర పదార్థాలను లోపలికి వెళ్లకుండా మాత్రమే ఇవి ఆపుతాయి. ఈ మాస్కులను ధరించిన వారి ఉమ్మి, తుంపరలు ఇతరులపై పడకుండా ఉంటాయి. అందుకనే సర్జికల్ మాస్కులను వైద్యులు, వైద్య సిబ్బంది ధరిస్తారు. ఈ మాస్కులను ధరించిన వారు ఎట్టి పరిస్థితిలోనూ తమ నోరు, ముక్కును టచ్ చేయరాదు. చేస్తే బాక్టీరియా, వైరస్‌లు అక్కడి నుంచి ఇతరులకు వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది.
9. సర్జికల్ మాస్కులు ఏ మేర గాలిని ఫిల్టర్ చేయగలవు, ఆ విషయంలో వాటి సామర్థ్యం ఎంత ?
నాణ్యతను బట్టి ఆ మాస్కులు 10 నుంచి 90 శాతం వరకు గాలిని ఫిల్టర్ చేయగలవు.
10. మాస్కుల క్వాలిటీని ఎలా తెలుసుకోవాలి ?
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ (NIOSH) లేదా నేషనల్ పర్సనల్ ప్రొటెక్టివ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ (NPPTL) గుర్తింపు ఉన్న మాస్కులు నాణ్యమైనవి. వాటిని వాడాల్సి ఉంటుంది.
11. క్లాత్ మాస్కులు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయా ?
క్లాత్ మాస్కుల తయారీలో వాడే క్లాత్ పెద్దగా రక్షణనివ్వదు. సర్జికల్ మాస్కులను ప్రత్యేకంగా నేయబడిన మెటీరియల్‌తో తయారు చేస్తారు కనుక వాటికి చాల సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. అందులోంచి గాలి లోపలికి అంత సులభంగా ప్రసారం కాదు. కానీ క్లాత్ మాస్కుల్లో క్లాత్‌కు కొంచెం పెద్దవైన రంధ్రాలు ఉంటాయి. అందువల్ల గాలి తేలిగ్గా లోపలికి ప్రసారమవుతుంది. దీని వల్ల అవి కొంచెం తక్కువ రక్షణను ఇస్తాయి.
12. క్లాత్ మాస్కులకు ఎక్స్‌ట్రా క్లాత్‌తో మరో లేయర్‌ను కుట్టవచ్చా ?
అలా చేసినా ప్రయోజనం ఉండదు. దాంతో అవి మనకు అందించే రక్షణ శాతం అదనంగా మరో 2 శాతం పెరుగుతుంది. అంతే తప్ప పెద్దగా లాభం ఉండదు.
13. సర్జికల్ లేదా క్లాత్ మాస్కులు ఎంత వరకు రక్షణ ఇస్తాయి ?
అవును, వాడవచ్చు. ఈ మాస్కులను వాడడం వల్ల ఫ్లూ వ్యాపించే అవకాశాలు 75 శాతం వరకు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
14. మాస్కులను మళ్లీ మళ్లీ వాడవచ్చా ?
క్లాత్ మాస్కులను ఉతికి మళ్లీ వాడుకోవచ్చు. సర్జికల్ మాస్కులను ఒక్కసారి వాడాక పడేయాల్సి ఉంటుంది. రెస్పిరేటర్ మాస్కులకు కొంత కాలం వరకు పరిమితి ఉంటుంది. ఆ కాలం దాటాక వాటిని వాడకూడదు.
15. మాస్కుల వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఏమని సూచనలు చేస్తోంది ?
సాధారణ జనాలు మాస్కులను వాడాల్సిన పనిలేదు. భౌతిక దూరం పాటిస్తూ చేతులను ఎప్పుడూ శానిటైజర్ లేదా సోప్‌తో శుభ్ర పరుచుకుంటే చాలు. అనారోగ్యంగా ఉన్న వారు సర్జికల్ మాస్కులను ధరించాలి. అనారోగ్యం బారిన పడ్డ వారి బాగోగులు చేసే వారు కూడా సర్జికల్ మాస్కులను ధరించాలి. ఇన్‌ఫెక్షన్ సోకిన పేషెంట్‌కు వైద్య పరీక్షలు చేసే వారు ఎన్95 మాస్కులను ధరించాలి.