జీవితంలో ఎలాగైనా సరే సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. అందులో భాగంగానే సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు కొందరు ఎంతగానో కష్టపడుతుంటారు. చాలా మంది ఇంటి రుణాలను పొందడం ద్వారా ఆ కలను నిజం చేసుకుంటారు. అయితే గడిచిన నెలల్లో కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాల వల్ల ఇంటి రుణాల వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. అలాగే ఇప్పుడు చాలా సులభంగా ఇంటి రుణం తీసుకునేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి.
ఇంటి రుణం తీసుకోవాలనేవారికి పలు సంస్థలు తక్కువ వడ్డీ రేట్లకే లోన్లను అందిస్తున్నాయి.
1. కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 6.75 శాతం వడ్డీకి ఇంటి రుణం తీసుకోవచ్చు.
2. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇంటి రుణ వడ్డీ 6.80 శాతంగా ఉంది.
3. బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం వడ్డీ రేటుతో ఇంటి రుణం అందిస్తోంది.
4. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.85 శాతం
5. బ్యాంక్ ఆఫ్ బరోడా – 6.85 శాతం
6. కెనరా బ్యాంక్ – 6.90 శాతం
7. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ – 6.90 శాతం
8. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.90 శాతం
9. యాక్సిస్ బ్యాంక్ – 6.90 శాతం
10. యూకో బ్యాంక్ – 6.90 శాతం
ఇవే కాకుండా ఐడీబీఐ, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, బజాన్ ఫిన్‌సర్వ్, టాటా క్యాపిటల్ వంటి సంస్థలు కూడా 6.90 శాతం వడ్డీకి ఇంటి రుణం అందిస్తున్నాయి. కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ లో 6.95 శాతం వడ్డీ రేటుతో హోమ్ లోన్ పొందవచ్చు.
ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసేందుకు సింగిల్ అభ్యర్థి లేదా జాయింట్ అభ్యర్థి ఎవరికైనా సరే 18 ఏళ్ల వయస్సు ఉండాలి. గరిష్టంగా 70 ఏళ్ల వరకు వయస్సు ఉన్నవారు రుణం పొందవచ్చు. అభ్యర్థులు ఇండియన్ లేదా ఎన్ఆర్ఐ లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయి ఉండవచ్చు. కచ్చితంగా వేతనం పొందుతూ ఉండాలి. లేదా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అన్నా చేస్తూ ఉండాలి. ఏడాదికి కనీసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు సంపాదన ఉండాలి. ఇంటి రుణం కోసం దరఖాస్తు పెట్టుకునే అభ్యర్థుల క్రెడిట్ స్కోరు 750 ఆపైన ఉండాలి.
ఇంటి రుణం కోసం ఐడీ ప్రూఫ్ కింద డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఆధార్ కార్డు, వోటర్ ఐడీ కార్డు లేదా పాస్‌పోర్ట్ లను సమర్పించవచ్చు. అదే అడ్రస్ ప్రూఫ్ కోసం అయితే యుటిలిటీ బిల్ పత్రాలు లేదా పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్‌లను చూపించవచ్చు. ఆదాయ ధ్రువీకరణ కోసం చివరి 3 ఏళ్ల ఐటీ రిటర్న్స్, బిజినెస్ లైసెన్స్ వివరాలు, అడ్రస్ ప్రూఫ్, టీడీఎస్ సర్టిఫికెట్, శాలరీ అయితే 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, ఫామ్ 16 లేదా 2 ఏళ్ల ఐటీ రిటర్న్స్ వంటి పత్రాలను చూపించాల్సి ఉంటుంది.
ఇక ఉద్యోగులు అయితే తమ కంపెనీ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఇతర ఏవైనా లోన్లు ఉంటే వాటికి చెందిన చివరి 6 నెలల స్టేట్‌మెంట్లు, వాటికి చెందిన 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లు చూపించాలి. అలాగే ప్రాపర్టీకి చెందిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, బిల్డర్ అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్ వివరాలు, డెవలప్ మెంట్ అగ్రిమెంట్ వివరాలు, కన్వేయన్స్ డీడ్ వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.