టెన్త్ పేప‌ర్ల లీకేజీ పై లోకేశ్ ఏమ‌న్నారంటే..

-

ప‌దో త‌ర‌గ‌తి పేప‌ర్ల లీక్‌, మాస్ కాపీయింగ్‌తో విద్యార్థుల‌కు తీర‌ని న‌ష్టం జరుగుతుంది. వైసిపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక తొలిసారిగా నిర్వ‌హిస్తున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మ‌న దేశంలోని ప‌రీక్ష‌ల చ‌రిత్ర‌లోనే చీక‌టి అధ్యాయంగా నిలిచాయి. రోజుకొక చోట పేప‌ర్ లీక్‌, మాస్ కాపీయింగ్‌, ఒక‌రి బ‌దులు ఒక‌రిని ఉంచి ప‌రీక్ష‌లు రాయించ‌డం, లీకైన ప్ర‌శ్న‌ప‌త్రాల‌కి జ‌వాబులు రాయించి జ‌త‌ చేయ‌డం వంటివ‌న్నీ జ‌రిగాయి.

ప్ర‌తిభ‌కి కొల‌మానంగా నిల‌వాల్సిన ప‌రీక్ష‌లు అక్ర‌మార్కులకి వ‌రం అయ్యాయి. చాలా చోట్ల పేప‌ర్ లీకై, వైసీపీ వాట్స‌ప్ గ్రూపుల్లో ప్ర‌శ్నాప‌త్రాలు ప్ర‌త్య‌క్షం అవడం, వైసీపీ నాయ‌కుల పిల్ల‌ల‌కి మెరుగైన మార్కుల కోసం బ‌రితెగించార‌ని స్ప‌ష్టం చేస్తోంది. టెన్త్ ప‌రీక్ష‌ల ఘోర‌వైఫ‌ల్యంతోనైనా గుణ‌పాఠం నేర్చుకుని, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలి…అని నారా లోకేశ్ సోష‌ల్ మీడియాలో పోస్టు ఉంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version