కేంద్రంలోని బీజేపీ పాలనపై ‘గ్రోక్ చాట్ బాట్’ ఏం చెప్పిందంటే?

-

కేంద్రంలోని బీజేపీ పాలనలో దుర్భరస్థితిలోకి దేశం వెళ్లిందని.. 50 సూచీల్లో అట్టడుగున భారత్ నిలిచిందని ఏఐ గ్రోక్ చాట్ బాట్ వెల్లడించింద. ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ఆహార భద్రత, పారిశ్రామిక రంగాల్లో దేశం అధోగతికి చేరిందని.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ సూచీల్లో అధఃపాతాళానికి పడిపోయింని రాసుకొచ్చింది.

దేశప్రగతికి కీలకమైన ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పారిశ్రామిక తదితర రంగాల్లో.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ వంటి 50కి పైగా సూచీల్లో మోదీ హయాంలో ఇండియా అట్టడుగు స్థానంలో నిలిచినట్టు ‘గ్రోక్‌’ ర్యాంకులతో సహా వెల్లడించినట్లు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. దేశ ప్రగతికి కీలకమైన ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలతోపాటు భద్రత, లింగ సమానత్వం, పౌర స్వేచ్ఛ, నిరుద్యోగిత,

 

ప్రజాస్వామ్యం, ద్రవ్యోల్బణం తదితర సూచీల్లో భారత్‌ అట్టడుగున నిలిచిందని తెలిపింది.సంతోషకరమైన దేశాల్లో 118వ ర్యాంకు, ఆకలి సూచీలో సూడాన్‌, రువాండా, కాంగో వంటి అతి పేద దేశాలకంటే అట్టడుగు స్థానంలో భారత్‌ నిలిచింది. ఇక పత్రికా స్వేచ్ఛలో భారత్‌ ర్యాంకు 140 నుంచి 159కి పడిపోయింది. ప్రజాస్వామ్య సూచీలో 2014లో భారత్‌ 27వ స్థానంలో ఉండగా ఇప్పుడు 47వ ర్యాంకుకు దిగజారింది.హెల్త్‌ అండ్‌ సర్వైవల్‌ ఇండెక్స్‌లో 2014లో 114వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 142వ ర్యాంకుకు పడిపోయిందని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news